Tuesday, May 7, 2024

నరసింహస్వామిపై సుప్రసన్న కీర్తనలు 3

శ్రీమాన్ కోవెల సుప్రసన్నచార్యుల వారు, అశువుగా, శ్రీ వెలిగొండ నరసింహ స్వామి వారిపై, రచించిన కీర్తనలను, స్వరపరచి, పాడే భాగ్యం కలిగింది. ఇది మూడవది. వరుసగా ఇవి స్వాధ్యాయ యూ ట్యూబ్ లో వస్తాయి. 🙏

 

 


నరసింహస్వామిపై సుప్రసన్న కీర్తనలు 2

శ్రీమాన్ కోవెల సుప్రసన్నచార్యుల వారు, అశువుగా, శ్రీ వెలిగొండ నరసింహ స్వామి వారిపై, రచించిన కీర్తనలను, స్వరపరచి, పాడే భాగ్యం కలిగింది. ఇది రెండవది. వరుసగా ఇవి స్వాధ్యాయ యూ ట్యూబ్ లో వస్తాయి. 🙏




డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారి పద్యం

శ్రీయుత డా. రామడుగు వెంకటేశ్వర శర్మ గారు, నా పై, చి. కోవెల సంతోష్ పై వ్రాసి పంపిన ఆశీః పూర్వక పద్య ద్వయము. స్వర కల్పన, గానం, పరిచయం, చి. పాణ్యం శంకర్ కుమార శర్మ.




Saturday, May 4, 2024

ఎండలంటే నాకిష్టం - ఎందుకో తెలుసా?

అందరూ ఎండలు బాబోయ్ ఎండలు అంటుంటే.. ఈయన మాత్రం 'ఎండలకేం? బంగారుకొండలు' అంటున్నాడు. ఎందుకో.. ఈ కథ చదివి తెలుసుకోండి.


 

https://sanchika.com/endalakem-bangaarukondalu-pds-story/ 

 

'మహాప్రవాహం!'-25

కేదార తండ్రి వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయినాడు. మీనాక్షమ్మ మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. “ఈరోజు కొత్తగా ఆయన నేర్చుకునింది ఏవి లేదురా కేదారా! ఆ పల్లెటూర్లో ఆయనకు తన విద్యత్తు నుపయోగించే అవసరం రాల్యా అంతే” అనింది. పద్మనాబయ్య చిరునవ్వుతో భార్యనూ కొడుకును చూసాడు. ఆ చూపుల్లో నిరహంకారం! అంతా ఆ పరాత్పరుని అనుగ్రహం తప్ప మరేమీ కాదనే ఒకానొక నిర్మమత్వం!


 https://sanchika.com/mahaapravaaham-pds-serial-25/

 


పప్పు భోగారావు గారి గళంలో నా 'మన్నించు నాన్నా..' కథ

నేను రచించిన 'మన్నించు నాన్నా..' కథని శ్రీ పప్పు భోగారావు గారు కథాస్రవంతి అనే యూట్యూబ్ ఛానెల్‍లో వినసొంపుగా చదివారు.
ఈ కథ నా కథా సంకలనం 'దత్త కథాలహరి'లోనూ, డా. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో వెలువడిన 'కథల లోగిలి' అనే సంకలనంలోనూ ఉంది.
విని ఆనందించండి.


 


Wednesday, May 1, 2024

నా నాటిక 'యత్ర నార్యస్తు పూజ్యంతే'కు తృతీయ బహుమతి

విశాఖపట్టణానికి చెందిన 'తెలుగు కళాసమితి' వారు 2024 సంవత్సరానికి నిర్వహించిన 13వ కథా నాటిక, స్వీయ నాటిక రచనల పోటీలలో నా నాటిక 'యత్ర నార్యస్తు పూజ్యంతే'కు తృతీయ బహుమతి లభించింది. నిర్వాహకులకు ధన్యవాదాలు.