వచనము:
"పుత్రా! ప్రహ్లాదకుమార! ఆ శ్రీహరి మనకు ఆగర్భశత్రువు. కపటి, నక్క జిత్తులవాడు. మీ పినతండ్రి హిరణ్యాక్షుని మాయోపాయమున వధించెను. వాని కొరకు సకల లోకములను గాలించుచున్నాను. దొరికిన యెడల వానిని చిత్రహింసల పాలుజేసి చంపెదను. నాకు భయపడివాడు ఎక్కడో దాగియున్నాడు. వాడా నీకు పూజనీయుడు! నాకు దివ్య వరప్రదాతయైన ధాతనారాధింపుము. లేదా కైలాసవాసియైన పరమేశ్వరు గొలువుము. అంతియగాని, నావైరియైన హరిని మాత్రము స్మరింపకము. దైత్యకుల దీపకుడగు నీవు మన వంశమునకు మచ్చ తీసుకురావలదు నాయనా! నీ తండ్రినైన నేను ఈ పదునాల్గు భువనములను శాసించుచున్నాను. అష్టదిక్పాలకులు, పంచభూతములు, నాకూడిగము చేయుచున్నారు. త్రిలోకములో ‘నమో హిరాణ్యాయ’ అని అందరును నన్నే స్తోత్రము చేయుచుండ, ఈ వెర్రి నీకేల?" అని తండ్రియుపన్యసింప, ప్రహ్లాద కుమారుడు వినయముతో నిట్లనెను.
ఉ.:
సత్యము నీవెరుంగక విశాల జగత్పరిపాల దక్షునిన్
దైత్యవిరోధియంచు నను ధ్యానము చేయక నిల్పుచుంటివే?
కృత్యము నాకు విష్ణుపదగానము, రాక్షస శ్రేష్ఠ! తండ్రి! నే
భృత్యుడ శౌరికిన్‌విడను పావనుడౌ హరినెంత చెప్పినన్
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
No comments:
Post a Comment