Wednesday, June 11, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 38వ భాగం లింక్

వచనము:
అనిన కుమారుని వచనంబులను విని మొదట విభ్రాంతుడై, పిదప క్రుద్ధుడైన ఆ దానవ మహీపతి, ముఖము జేవురించ, పెదవులదర, నేత్రములు అరుణిమ నొంద, నొక్కనుదుటన సుతుని ఒడినుండి నేలబడద్రోసి, కోపానలజాజ్వాల్యమాన మానసుండై, పర్జన్యగర్జారవంబును బోలిన కంఠస్వరంబున దిక్కులు  పిక్కటిల్ల, గురువులతో నిట్లు పలికెను.

ఉ.:
విప్రకులాధమా! సుతుని  విద్యలబోధల జేయుమంచు నే
నప్రతిమాన జ్ఞానులని నమ్ముచు మీకడబంప, వీడిటుల్‌
నా ప్రతిజోదు విష్ణువును నా యెదుటే స్తుతియించు చుండెగా
క్షిప్రము నిట్టి ధోరణిని భేదము చేయక పర్వునిల్చునే?
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-38/










No comments:

Post a Comment