వారిని ప్రేమతో లేవనెత్తి, పరమాత్ముండైన కేశవుండు, కరుణా పూరిత వాక్కులతో నిట్లు పలికె “ఓ జయవిజయులారా! సనక సనందనులు కోపించి శపించినను, మీరు ఎంతో సహనము వహించి, మాటలాడక, స్థిరచిత్తముతో నిలిచినారు. ఇది ప్రశంసనీయము. మునుల శాపంబు మరలింప నాకును శక్యము గాదు. తపశ్శాలురు, విశ్వకల్యాణకాములునగు యోగిపుంగవుల ఆగ్రహమును సైతము అనుగ్రహము గానే భావించవలెను. ఏలయన..”
ఉ:
యోగులు మౌనిసత్తములు, ఊర్జిత దివ్య తపోనిధానులున్
ఆగమ సర్వశాస్త్ర విదులందరి మేలును కోరువారు, నే
భోగములన్ చరింపరు విమోహ విదూరులు, జ్ఞానపూర్ణులున్
ఈ గతి మీరు పొందుటకు నేపరమార్థము గోరి యల్గిరో?
---
మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు:
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-10/
దత్తగీతి అనే ఒక చందస్సును సృష్టించి వ్రాయడం చాలా బాగుంది. జయ విజయల శాపము ఉపశమనానికి మార్గము చేసిన వర్ణనలు చాలా బాగున్నాయి
ReplyDelete