Wednesday, December 4, 2024

డా. వైరాగ్యం ప్రభాకర్ గారి 100వ పుస్తకావిష్కరణ సభ - ఆహ్వానం

భవాని సాహిత్య వేదిక ఆధ్వరంలో కరీంనగర్ లో 8 డిసెంబర్ 2024న ఆత్మీయ సోదరులు డా. వైరాగ్యం ప్రభాకర్ గారి 100వ పుస్తకం ఆవిష్కరణ సభ జరుగుతోంది.
వంద పుస్తకాలు ప్రచురించడం ఒక చారిత్రాత్మక విజయం. ఆ అరుదైన సభలో ప్రధాన వక్తగా నాకు ఆహ్వానం. అది నాకొక గౌరవం 🙏🌹 

Click on image to view in bigger size
 

1 comment:

  1. ఇది శ్రీ ఆచంట సూర్య నారాయణ మూర్తిగారి స్పందన: *శ్రీ పాణ్యం దత్తశర్మగారు వైరాగ్యం ప్రభాకర్ గారి పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానించబడుట మా పాఠకమహాశయులైన ఆయన అభిమానులందరికీ మిక్కిలి సుదినం. ఆధునిక యక్షప్రశ్నలు-2-దత్తవాక్కు. చక్కని ఆవిష్కరణ. "కావ్యంయశసేsఅర్ధకృతే, వ్యవహారవిదే" అనునట్లు కావ్యం సమాజానికి మహత్తర సందేశమిచ్చేదిగా ఉండాలి. శ్రీ దత్తశర్మగారి ఆంధ్రప్రభలోప్రచురితమయ్యే దత్తవాక్కులు ఇందులకు ఉదాహరణ. ఇవియే కాక యీయన రచనలు నేటి సమాజానికి అందునా భావిభారత పౌరులైన యువకులకు మంచి మార్గదర్శకత్వం వహించేవిగా ఉంటాయి.వ్యక్తిత్వ వికాస తరగతులకు వేరే డబ్బు ఖర్చుపెట్టుకొని వెళ్ళవలసిన అగత్యం ఏర్పడదు. సామాజిక దృక్కోణ దృష్టితో, సమ సమాజ నిర్మాణం కొరకు పాటుబడే మహత్తర రచయిత, కవి, పండితుడు వాగ్గేయకారుడు శ్రీ దత్తశర్మ. సంగీత సాహిత్య వినీలాకాశానికి రాకాసుధాకరుడీయన. ఈయనకిచ్చిన గౌరవం ఆయన అభిమాన సాహితీప్రియులకిచ్చినట్లే. 💐💐💐. - ఆచంట సూర్య నారాయణ మూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సీపట్నం.*

    ReplyDelete