మరియును, నీవు పరమాత్మయైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉన్నావు. ఆ పరాత్పరుండు,
మ.కో.:
ఆది అంతము లేని దేవుడు ఆత్మరూపుడు శౌరియే
వేదవేద్యుడు బ్రహ్మకైనను విశ్వపూజ్యుడు విష్ణుడే
ఆదిలక్ష్మికి ప్రాణనాథుడు అంబుజాక్షుడు శ్రీహరిన్
పాదపద్మము లాశ్రయించితి ప్రాపు నీకవె నిత్యమున్
~
దేవేంద్రుని భయ నివారణకు చేసిన ప్రయత్నాలు చివరకు మంత్రోపదేశము జరగడం ధైర్యం కలిగించడం బాగుంది. సతతంబు నిరతంబు అని శంబు అరయంబు లతో సీస పద్యం చాలా బాగుంది
ReplyDelete