డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 6వ భాగం సంచికలో చదవండి.
~
సరిగ్గా ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. వైనతేయ వంగపండు రంగు ధోవతి ధరించాడు. అది వదులవకుండా నడుముకు మెత్తని, ఎర్రని ఉత్తరీయం బిగించాడు. నుదుట తిరునామం దిద్దుకున్నాడు. మెడలో రుద్రాక్షమాల. వక్షం అనచ్ఛాదితం. కనకాంబరాలు, జాజులు, మరువము, చిట్టి చేమంతులతో అల్లిన కదంబమాల మెడలో వేసుకున్నాడు. కాళ్లకు చిరుగజ్జెలున్న పట్టీలు కట్టుకున్నాడు. ఎడమ చేత చిడతలు. దశ వర్ష ప్రాయుడైన ఆ బాల హరిదాసు సాక్షాత్తు ప్రహ్లాద కుమారునిలా ఉన్నాడు.
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-6/
వైద్యుని అరంగేట్రం గొప్పగా ఉంది ఎవరూ ఊహించని విధంగా పైనతేయుడు గురువుగారి గురించి దస్తగిరి గారి గురించి తల్లిదండ్రుల గురించి పద్యాలు అందుకని అందరినీ ఆశ్చర్యం లో ఉంచి వేయడం కథలో గొప్ప మలుపు
ReplyDeleteVynatheyuuni
ReplyDelete