Wednesday, June 11, 2025

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 38వ భాగం లింక్

వచనము:
అనిన కుమారుని వచనంబులను విని మొదట విభ్రాంతుడై, పిదప క్రుద్ధుడైన ఆ దానవ మహీపతి, ముఖము జేవురించ, పెదవులదర, నేత్రములు అరుణిమ నొంద, నొక్కనుదుటన సుతుని ఒడినుండి నేలబడద్రోసి, కోపానలజాజ్వాల్యమాన మానసుండై, పర్జన్యగర్జారవంబును బోలిన కంఠస్వరంబున దిక్కులు  పిక్కటిల్ల, గురువులతో నిట్లు పలికెను.

ఉ.:
విప్రకులాధమా! సుతుని  విద్యలబోధల జేయుమంచు నే
నప్రతిమాన జ్ఞానులని నమ్ముచు మీకడబంప, వీడిటుల్‌
నా ప్రతిజోదు విష్ణువును నా యెదుటే స్తుతియించు చుండెగా
క్షిప్రము నిట్టి ధోరణిని భేదము చేయక పర్వునిల్చునే?
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-38/










తెలుగు జ్యోతి వెబ్ పత్రికలో నా కథ 'మానస మథనం! గహనం'

2025 జూన్ 05 తేదీ తెలుగు జ్యోతి వెబ్ పత్రికలో నేను రాసిన 'మానస మథనం! గహనం' అనే కథ ప్రచురితమైంది.
https://telugujyothi.com/article/-/asset_publisher/XZizXceULULO/content/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8-%E0%B0%AE%E0%B0%A7%E0%B0%A8%E0%B0%82-%E0%B0%97%E0%B0%B9%E0%B0%A8%E0%B0%82-?magazineId=501&articleId=64123
ఈ లింక్ పై క్లిక్ చేసి కథని చదవవచ్చు.


Sunday, June 1, 2025

‘శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!’ 14వ భాగం

సంచిక మాస పత్రికలో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తోంది. ఇది 14వ భాగం. 🙏
~
అక్కడి పరిస్థితిని మాలతమ్మ ఇలా వర్ణించారు.
“ఇది ఎమర్జెన్సీ సమయం. పోలీసుల చేతుల్లో సర్వాధికారాలు ఉన్నాయి. ఒక మనిషిని ఎందుకు నిర్బంధంలోకి తీసుకొన్నారు? ఎన్నాళ్లు ఉంచుతారు? న్యాయవిచారణ జరుపుతారా? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వక్కరలేని వ్యవస్థలో ఉన్న తాము ఎమ్.ఎ చదివే ఒక ఆడపిల్లను రక్షించగలమా?”
ప్రజాస్వామ్యం కాస్తా నియంతృత్వంగా మారితే ఉత్పన్నమయ్యే ప్రశ్నలివి.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-14/





పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 37వ భాగం లింక్

వచనము:
అని ప్రహ్లాదుండు గురువులకు స్పష్టము చేయ, వారు కోపించి, “దండం  దశగుణం భవేత్‌” అన్న సూక్త్యానుసారము శిక్షించినగాని, వీడు మన దారికి రాడని నిశ్చయించి, సేవకు బిల్చి,  ఇట్లు పలికిరి
ఉ.:
సేవక! బెత్తమొక్కటి విశేషముగా కొని తెమ్ము, వీడు మా
లావగు జిత్తులన్‌, గురుల, రాక్షస జాతిని మోసగించుచున్‌
ఈ విపరీత పోకడల నెగ్గుదలంచుచు దైత్యనాధుకున్‌
మా వలనన్‌ఇదంతయును భావ్యమటంచు విభుండు బల్కగాన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


  https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-37/

 

 

ఉషా వారపత్రికలో నా కథ 'చురుకైన భాగస్వామి'

2025 మే 27 - జూన్ 02 తేదీ ఉషా వారపత్రికలో నేను రాసిన  'చురుకైన భాగస్వామి' అనే కథ ప్రచురితమైంది.
ఈ క్రింద బొమ్మలపై క్లిక్ చేసి కథని చదవవచ్చు.

 



 


 Click on images to view in bigger size

 

శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకం - 5వ భాగం - శ్రీరామలక్ష్మణ నారద సంవాదం

నేను, నా తమ్ముడు పాణ్యం శంకరశర్మ శ్రీరామాంజనేయ యుద్ధం పద్యనాటకంలో పాత్రలుగా... పద్యాలు పాడాము.
రచన వీరరాఘవస్వామి. ఆయనను 'శేషప్ప'  అని కూడా అంటారు.
5వ భాగం స్వాధ్యాయ ఛానెల్‌లో చూడండి/వినండి.


 


పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 36వ భాగం లింక్

 వచనము:
“ఈ ఎఱుకను నేను నేర్చుకున్నాను తండ్రీ!” యని పలికిన తనయుని జూచి, “బాలుర బుద్ధి, ఇతరుల బోధలను బట్టి మారుచుండును గదా!” యని దరహాసము చేసి, గురువులతో నిట్లుపలికెను.
చం.:
గురువరులార! మీ వసతి గుంభనరీతిని విష్ణు భక్తులీ
చిరుతని, మారువేషముల జేరి, విరోధిని మెచ్చు శాస్త్రముల్‌
అరయగజేసినారు, భవదాశ్రయమందున, జాగరూకులై
సరియగు విద్య నేర్పుడు భృశంబగు శ్రద్ధ, సహింపనేనికన్‌
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)


https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-36/