Thursday, March 6, 2025

3వ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాలు 2025 - నివేదిక - లింక్

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తెలుగు అధ్యయన శాఖ, ప్రాచ్య పరిశోధన సంస్థ, తిరుపతి, మరియు ‘తెలుగు సంపద’ బెంగుళూరు వారి సంయుక్త ఆధ్యర్యంలో, ఫిబ్రవరి 27, 28 తేదీలలో 3వ అంతర్భాతీయ తెలుగు భాషా సమావేశాలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
మొదటి సెషన్‍లో (27 ఫిబ్రవరి తేదీన) నేను నా పరిశోధనా పత్రాన్ని సమర్పించాను. మొదటగా, కవిసమ్రాట్ విశ్వనాథ విరచితమైన ‘ఒక్క సంగీతమేదో పాడునట్లు, భాషించునపుడు వినిపించు భాష’ అన్న తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని వివరించే సీస పద్యాన్ని సుస్వరంగా ఆలపించగా, సభికులు పరవశించి, కరతాళ ధ్వనులు చేశారు.
పూర్తి నివేదికని సంచికలో చదవండి.

 

https://sanchika.com/moodava-antarjaateeya-telugu-bhaashaa-samaavesaalu-2025-nivedika/

 

Wednesday, February 26, 2025

శివరాత్రి మాహాత్మ్యం - నా ప్రసంగం - యూట్యూబ్ లింక్

ఆంధ్రప్రభ, భక్తి.. ఛానల్‌లో ప్రసారమైన నా ప్రసంగం, శివరాత్రి మాహాత్మ్యం గురించి.
జయ జయ పార్వతీ మనోహర! హర హర! మహాదేవ!🙏




Tuesday, February 25, 2025

శివరాత్రి ప్రత్యేకం: రహస్యం సినిమాలోని గిరిజాకల్యాణం యక్షగానం: - యూట్యూబ్ లింక్

శివరాత్రి పర్వ దినాన నేను శివునికి నివేదించిన సంగీత కుసుమం 🙏🌹శంభో, శంకర!


 


మహేశ్వరుడి మూల రూపంలో ఎన్నెన్నో రహస్యాలు - యూట్యూబ్ లింక్

విగ్రహ రూపధ్యాన విశేషాలపై వ్యాఖ్యానం


 

దేవుడి విగ్రహాల తయారీలో ఎన్నో నిబంధనలు - యూట్యూబ్ లింక్

టీటీడీ వారు, 750 పేజీల, 'రూప ధ్యాన రత్నావళి' అన్న బృహత్ గ్రంథాన్ని ప్రచురించారు. అందులో వివిధ దేవతా మూర్తుల రేఖా చిత్రాలు, ఆయా ధ్యాన శ్లోకాలు, దాదాపు 300 దాకా ఉన్నాయి. ఈ వీడియో సీరీస్ లో, క్రమంగా, కొన్ని రూపాలను, ఒకో వీడియోలో, శ్లోకాన్ని స్వర పరచి పాడి, వ్యాఖ్యానం చేసి, స్వాధ్యాయ చానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. ఆదరించ మనవి. ఆస్తికులైన బంధు మిత్రులకు దయచేసి షేర్ చేయండి 🙏
దేవుడి విగ్రహాల తయారీలో ఎన్నో నిబంధనలు: విగ్రహ రూపధ్యాన విశేషాలపై వ్యాఖ్యానం తొలి భాగం..
బాలగణపతి, తరుణ గణపతి రూపాల వెనుక విశేషాలు.




నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 16వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 16వ భాగం సంచికలో చదవండి.
~
“సార్. మన వార్షికోత్సవంలో, నేను షేక్‌స్పియర్ ‘హామ్లెట్’ నాటకం లోని సాలలొక్వే (స్వగతాలు) లను, యథాతథంగా, తర్వాత సరళమైన తెలుగు పద్యాలలో, అభినయించి ప్రదర్శిద్దామని అనుకుంటున్నాను. మీ ఆశీస్సులు కావాలి.”
అతని గొంతులో వినయం ఉట్టిపడింది. ఆ వినయమే అతన్ని గురుప్రియుడిని, జనప్రియుడిని చేసింది. ‘విద్యా దదాతి వినయమ్’ అన్నది వైనతేయుని పట్ల అక్షరసత్యం!
ఇంగ్లీషు సారు సంతోషించాడు. “ఇట్ విల్ బి యాన్ అల్‌టుగెదర్ డిఫరెంట్ రెండరింగ్, వైన!” అన్నాడు. “ది సాలిలొక్వేస్ ఇన్ హామ్లెట్ ఆర్ ఫిలసాఫికల్ అండ్ డీప్. ఐ విల్ గైడ్ యు యాజ్ టు హౌ యు కెన్ డు జస్టిస్ టు ది స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. బట్ రిగార్డింగ్ తెలుగు పోయమ్స్, మ౦గా మేడమ్ విల్ హెల్ప్ యు. ఓకె?” అన్నాడు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 

https://sanchika.com/srimadramaramana-pds-serial-16/

 

పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 23వ భాగం లింక్

“కావున మనమందరము వైకుంఠవాసుడైన విష్ణుని పాదపద్మంబుల నాశ్రయింతము. మన దుస్థితి యంతయు నా కేశవునకు విన్నవింతము. ఆయన చెప్పిన తెఱంగున నడచుకొందము” అని బృహస్పతి దివిజులకు ఎఱింగించెను. ఇట్లు దేవశ్రవుని వలన గాలవుండు సకలంబును తెలిసికొని సంతోషము పొందెను.
అంబురుహ వృత్తము:
ఆవల నీవల నంతయు గాచెడి ఆర్తబంధు! పరాత్పరా!
నీ వలనన్ సకలంబును నిల్చును నీవె దిక్కు, నిరంజనా!
కావుము దేవతలందరి నీ దయ కార్యకారణహేతువై
చావుయె లేని వరంబును బొందిన శత్రు దున్ముము మృత్యువై
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)

 


 https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-23/