క్షీరాబ్ధిని రమ్యముగా వర్ణించిన తదుపరి దేవశ్రవుండు, శ్రవణ పేయంబుగా, గావలునకు, శ్వేతద్వీపంబు కట్టెదుట నిలుచు భంగి, దాని విశేషంబుల నుడువ దొడంగె -
కం:
క్షీరపయోధికి మధ్యన
నెఱచక్కని శ్వేత ద్వీపమింపును గూర్చున్
అరయగ బహు యోజనవి
స్తారము, రమణీయ దివ్య దృశ్యము లలరున్
పాలసముద్రం వర్ణనలో ఉప్పుసముద్రమే పాలసముద్రం అని చెప్పిన విధంగా చాలా బాగుంది. సముద్రుడు అల్లద్వారా భూమిని కౌగిలించుకున్నాడు అని చెప్పడం ఎంతో హృద్యంగా ఉంది అలాగే శ్వేత ద్వీప వర్ణన కూడా చక్కగా సాగింది తరువోజ నడకలు చూస్తూ ఉంటే ఎంతో సంగీత పరంగా సాగింది అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ భాగం
ReplyDelete