Saturday, November 9, 2024

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 1వ భాగం సంచికలో

డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 1వ భాగం సంచికలో చదవండి.
~
ఇంకా ఇరవై నిమిషాలుంది మధ్యాహ్నం సెషనుకు. “మద్దిలేటి, వెళ్లి వైనతేయ గాడిని రమ్మని చెప్పు” అన్నాడు సారు. వాడు వచ్చి చేతులు కట్టుకొని నిలబడినాడు.
“ఒరేయ్, నిన్న నేను నేర్పిన పద్యం ప్రాక్టీసు చేసినావా?” అని అడిగినాడు సారు.
“చేసినా గాని సార్, అక్కడక్కడా సరిగ్గా రావడంల్యా” అన్నాడు వాడు తల గోక్కుంటూ.
“ఏదీ ఒకసారి అను.”
వాడు పాడుతుంటే వినడానికి చాలామంది పిల్లలు వచ్చి నిలబడినారు.


 https://sanchika.com/srimadramaramana-pds-serial-1/

 

No comments:

Post a Comment