విష్ణువును పూజించి, స్మరించి, ధ్యానించడం సర్వపాపహరి అని, దాని వల్ల తప, జప, దాన, క్రతువులతో అవసరం ఉండదని కవి చెబుతున్నారు.
సీ:
తపము లెన్నియు జేయ తప్పని పాపాలు
హరినామస్మరణతో నణగిపోవు
జవముల నారని సర్వమాలిన్యములు
ఎదమాధవుని నిల్ప నెగిరిపోవు
దానాలబోవని ఘన దోషములు నెల్ల
ఆర్తి కేశవు గొల్వ నంతరించు
క్రతువులు చేసినన్ కదలని వెతలెల్ల
వైకుంఠు ధ్యానము వలన తొలగు
తే.గీ.:
తేట నీటిని బోలిన మేటి మనసు
బద్మనాభుని నిలుపుచు మహిత భక్తి
సర్వశరణాగతిని బొంద సాధ్యపడును
దురిత దుఃఖంబులవి ఎల్ల మాను త్రోవ
---
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
Saturday, November 9, 2024
పద్యకావ్యం 'శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము' 8వ భాగం లింక్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment