సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 7వ భాగం. 🙏
~
అతన్ని ఎలక్షన్లో నిలబెట్టాలని వారి తాపత్రయం. గతంలో తన ఖద్దరు గుడ్డలను గోనె పట్టాలని ఎగతాళి చేసిన బావమరది ఇలా అన్నాడు - “బావా.. నీకున్న పేరు, గౌరవం నీకు తెలియదు. నీవు జైల్లో ఉండగానే నందయ్యగారు నీ పేరిట నామినేషన్ దాఖలు చేశారు.”
ఎంత తేడా?
“ఇదిగో గోపాలం - నీ పేరు పార్టీ ప్రముఖులు ఒప్పుకున్నారు. నిన్ను చీరాల్లో నిలబెడుతున్నాం” - నందయ్య.
అతని ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.
“మూఢునిలా కూచున్నాడు గోపాల రావు.”
గోపాల రావు జైలు జీవితాన్ని, స్వాతంత్ర్య సమరంలో అతని పాత్రను వాళ్లందరూ cash చేసుకోవాలనుకుంటున్నారు. ‘Opportunism’ అంటే అవకాశవాదానికి అది పరాకాష్ఠ. మొన్నటివరకు నిష్ప్రయోజకుడని తెగడిన నోళ్ళే అతన్ని దేశాన్ని ఉద్దరించబోయేవాడని పొగడుతున్నాయి.
~
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-7/
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు చేసుకునేలా చేశావు
ReplyDelete