కార్తీక మాస సందర్భముగా శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ ప్రాంగణములో (కోనేరు వద్ద, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా) తేది 25-11-2024 సోమవారం ఉదయం 10గం.లకు 'కార్తీక వైభవం' - ప్రవచనం చెప్పాను. ఆ కార్యక్రమంపై జెట్టి వంశీకృష్ణ అందించిన నివేదిక సంచికలో చదవగలరు.
https://sanchika.com/kartika-vaibhavam-pravachanam-nivedika/
ఇది ఆచంట సూర్య నారాయణ మూర్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సీపట్నం అభిప్రాయం: *శ్రీ పాణ్యందత్త శర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అష్టావధాని, శ్రీ లక్ష్మీ నరసింహ శర్మ, లక్ష్మీ నర్సమ్మ పుణ్య దంపతులకు కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. తండ్రిగారి వారసత్వ సంపదను పుణికిపుచ్చుకుని శ్రీదత్తశర్మగారు కవిగా, పండితునిగా, గాయకునిగా సంగీతసాహిత్యసమలంకృతునిగా ప్రఖ్యాతి చెంది, దేశం నలుమూలలా అనేక సత్కారాలు స్వంతం చేసికొన్నారు. ఈయన రచనలు పాఠకులకు మిక్కిలి స్ఫూర్తిదాయకం. సామాజిక స్ఫూర్తితో సామాజిక సందేశంతో సమాజంలోని సమస్యలకు పరిష్కారసూచకంగా ఎంతోమంది పాఠకులకు తమ రచనల ద్వారా దిశానిర్దేశం చేస్తూ పాఠకుల హృదయాల్లో తమదైన శైలిలోముద్ర వేసికొన్నారు. పాఠకులు సంతోషంతో తమ అమూల్యమైన అభిప్రాయాలు సలహాలు, వ్యక్తీకరిస్తూ తమ ఆనందాన్నివ్యక్తీకరించుట ఎంతో ముదావహం. కవి లేఖిని నుండి ఇంకా ఎన్నో రచనలు వెలువడాలని కాంక్షిస్తున్నాను.
ReplyDelete💐🙏 నర్సీపట్నం జ్ఞాన సరస్వతీ ఆలయంలో జ్ఞానసరస్వతీ సేవా ట్రష్టు వారి ఆధ్వర్యంలో శ్రీ కార్తీక మాసం వైభవమును వీనులవిందుగా భక్తి రసస్ఫోరకంగా శ్రీ త్యాగరాజ స్వామి వారి, శ్రీ అన్నమాచార్య వారి కీర్తనల నాలాపించి భక్తజనసందోహమును భక్తిపారవశ్యంలో ఉర్రూతలూగించారు. సాయంకాలము శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానమును, ఆయన మహిమా విశేషములను, వర్ణిస్తూ మవర్ధినీరాగము నాలాపించి శ్రోతలను మంత్రముగ్దులను గావించిరి. శ్రీ ఎల్లమందగారు విశ్రాంత ఆంధ్రభాషోపన్యాసకులు సాహితీప్రియులు, ఈ కార్యక్రమములు నిర్వహించుటలో తమ వంతు ఎంతో సహాయసహకారములందజేసిరి. ఆలయ ట్రష్టువారు శ్రీదత్తశర్మగారినీ, శ్రీ ఎల్లమందగారినీ, దుశ్శాలువలను బహూకరించి సన్మానించిరి.
ఆచంట సూర్య నారాయణ మూర్తి రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సీపట్నం